ప్రయాణాలు


బాటసారి పయనం

గమ్యం చేరేవరకే


ఒంటరి పయనం

తోడు దొరికేవరకే


పడవ పయనం

ఆవలిగట్టుకు వెళ్ళేవరకే


బండి పయనం

వెళ్ళవలసిన ఊరువచ్చేవరకే


కెరటాల పయనం

తీరం తగిలేవరకే


మేఘాల పయనం

వాన కురిసేవరకే


కాంతి పయనం

రవిచంద్రులు అస్తమించేవరకే


కలల పయనం

నిద్రనుండి మేలుకొనేవరకే


ప్రేమ పయనం

పెళ్ళి చేసుకొనేవరకే


స్నేహ పయనం

ఆటుపోట్లు తట్టుకొనేవరకే


చూపుల పయనం

కనులు కాంచేవరకే


నవ్వుల పయనం

మోములను వెలిగించేవరకే


ఆలోచనల పయనం

అంతరంగాన్ని తట్టేవరకే


భావాల పయనం

బయటకు వెల్లడించేవరకే


మనసు పయనం

మేను గ్రహించేవరకే


కానీ

కవన పయనం

కాయం కట్టెల్లోకాలేవరకూ


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం


Comments

Popular posts from this blog