నేటి నాజన్మదినకవిత


నా పుట్టినరోజునరాసినకవితకు

ఎవరూ శుభాకాంక్షలుచెప్పలేదు

ఎవరూ బహుమతులుపంపలేదు


నా కవితను

ఎవరూ కోరలేదు

ఎవరూ చదవలేదు


నా కవితకు

ఏ అంశమూలేదు

ఏ లక్ష్యమూలేదు


నా కవితకు

ఏ శిల్పమూలేదు

ఏ శైలీలేదు

 

నా కవితకు

ఏ ప్రారంభమూలేదు

ఎటువంటి అంతమూలేదు


నా కవితకు

పాఠకులులేరు

విమర్శకులులేరు


నా కవిత

విశిష్టము

విభిన్నము


నా కవిత

నిగూఢము

నిర్మలము


అసలు ఈనాకవితను

ఇప్పటివరకూ ఎవరికీపంపలేదు

ఎవరినీ విసిగించలేదు


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం


Comments

Popular posts from this blog