కవితపుట్టాలంటే
సమయం
రావాలి
సందర్భం
కావాలి
అందాలు
కనపడాలి
ఆనందాలు
కలిగించాలి
కలలు
కనాలి
కల్పనలు
చెయ్యాలి
కవిత
కవ్వించాలి
మమత
మురిపించాలి
ఆలోచనలు
పారాలి
భావములు
ఏర్పడాలి
కలం
కదలాలి
కాగితం
నిండాలి
మెదడును
మర్ధించాలి
మనసును
కదిలించాలి
విషయం
దొరకాలి
హృదయం
స్పందించాలి
పోలికలు
తట్టాలి
ప్రాసలు
కుదరాలి
అక్షరాలు
అందాలి
పదములు
పొసగాలి
అప్పుడు
కవిత్వం
పుడుతుంది
కమ్మదనం
పంచుతుంది
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment