ప్రేమసందేశం
ప్రేమను
పెట్టెలోపదిలపరచి
కాపాడుకుంటున్నా
ప్రేమను
పొట్లంలోకట్టి
భద్రపరచుకుంటున్నా
ప్రేమను
పువ్వుల్లోపెట్టి
పరిరక్షించుకుంటున్నా
ప్రేమను
మనసులోదాచుకొని
మననంచేసుకుంటున్నా
ప్రేమను
గుండెలోమరుగుపరచుకొని
గురుతుకుతెచ్చుకుంటున్నా
ప్రేమను
హృదిలోపొందుపరచుకొని
యాదిచేసుకుంటున్నా
ప్రేమను
మరచిపోలేక
మాటిమాటికితలచుకుంటున్నా
ప్రేమను
మాటల్లోచెప్పలేక
మౌనందాలుస్తున్నా
ప్రేమను
పువ్వులిచ్చితెలుపలేక
పరెశానవుతున్నా
ప్రేమను
లేఖలోకెక్కించినా
పంపలేకున్నా
అయితే
ప్రేమను
కవితగామలచి
బహర్గితంచేస్తున్నా
ప్రేమ
ప్రేయసికిచేరుతుందని
ఆశపడుతున్నా
ప్రేమకు
ప్రతిస్పందిస్తుందని
ప్రతీక్షిస్తున్నా
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment