అందాకా ఏగేదెట్లాగా!


ఇంకా కొద్దిసేపు

ఇక్కడే ఉండమంటాడు

ఆప్పుడే వెళ్ళటానికి

అంతతొందర ఏమంటాడు


వెళ్ళకుండా

అడ్డుకుంటాడు

పొనీకుండా

పట్టుకుంటాడు


చెంతనే

ఉండమంటాడు

కబుర్లను

చెప్పమంటాడు


సరసాలు

ఆడుకుందామంటాడు

సల్లాపాలు

కొనసాగిద్దామంటాడు


చిరునవ్వులు

చిందమంటాడు

మరుమల్లెలు

చల్లమంటాడు


ముచ్చట్లు

చెప్పమంటాడు

మురిపాలు

చెయ్యమంటాడు


చక్కదనాలు

చూపమంటాడు

ఆనందాలు

అందించమంటాడు


వెన్నెలలో

విహరిద్దామంటాడు

పూలతోటలో

పచారీచేద్దామంటాడు


పెళ్ళయ్యేదాకా

ఏగేదెట్లాగా

ఆపేదెట్ల్లాగా

ఆగేదెట్ల్లగా


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం


Comments

Popular posts from this blog