నారదులున్నారు జాగ్రత్త!
నారదలున్నారు
జాగ్రత్త
తగాదాలుపెడతారు
జాగ్రత్త
పైకి స్వామిభక్తి
చాటుతారు
కానీలోన గోతులుతీసి
పడదోయచూస్తారు
ఇక్కడ మాటలు
అక్కడ చెబుతారు
అక్కడ మాటలు
ఇక్కడ చెబుతారు
పుకార్లు పుట్టిస్తారు
జాగ్రత్త
విద్వేషాలు రేపుతారు
జాగ్రత్త
అసూయతో
రగిలిపోతుంటారు
ఈర్ష్యతో
కుమిలిపోతుంటారు
కొట్టుకుంటుంటే
కుతూహలపడతారు
తిట్టుకుంటుంటే
తృప్తినిపొందుతారు
చాడీలు
మోస్తారు
చేతులు
కలుపుతారు
లాభాలు
పొందుతారు
స్వార్ధపరులు
అవుతారు
కక్కుర్తి
పడతారు
కాటువేయ
చూస్తారు
కుటుంబాలను
కూల్చుతారు
స్నేహితులను
విడదీస్తారు
ప్రేమికులమధ్య
చిచ్చురేపుతారు
పోటీదారులమధ్య
పెట్రోలుపోస్తారు
నిప్పును
రగిలిస్తారు
మంటలు
లేపుతారు
బూటకాలు
చేస్తారు
నాటకాలు
ఆడతారు
తప్పక నారదలు
బొక్కబోర్లాపడతారు
బాధితుల చేతులకుచిక్కి
తన్నులుతింటారు
నారదులను
గమనించండి
నాటకాలకు
తావివ్వకండి
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment