మారిన మహిళలు
ఓణీలు
వెయ్యటంలేదు
పైటలు
కప్పుకోవటంలేదు
చీరెలు
కట్టటంలేదు
రవికలు
తొడగటంలేదు
జీన్సుఫాంటులు
వేస్తున్నారు
టీషర్టులు
తొడుగుతున్నారు
ఇంటిపనులు
చెయ్యటంలేదు
వంటపనులు
సాగించటంలేదు
జడలు
వేసుకోవటంలేదు
పూలు
పెట్టుకోవటంలేదు
సిగ్గు
పడటంలేదు
శిరసు
వంచటంలేదు
పెళ్ళికి
తొందరపడటంలేదు
పిల్లలను
వెంటనేకనటంలేదు
సైకిల్లు
తొక్కుతున్నారు
బైకులు
నడుపుతున్నారు
ఉన్నతవిద్యలు
చదువుతున్నారు
ఉద్యోగాలు
చేస్తున్నారు
వివాహానికి
కట్టుబడటంలేదు
విడాకులకు
వెనుకాడటంలేదు
చెప్పింది
వినటంలేదు
నచ్చింది
చేసుకుపోతున్నారు
వాంఛలు
తీర్చుకుంటున్నారు
స్వేచ్ఛను
కోరుకుంటున్నారు
బంధానికి
చిక్కటంలేదు
అనుబంధానికి
కట్టుబడటంలేదు
మగువలు
మగవారితోసమమయ్యారు
ఆకాశంలో
అర్ధభాగమయ్యారు
మొగుళ్ళ
ఆటలు చెల్లటంలేదు
పెళ్ళాల
పెత్తనాలు ఆగటంలేదు
కాలం
మారింది
కలికికాలం
మొదలయ్యింది
మగువలకు
అభినందనలు
నవీనతకు
స్వాగతము
గుండ్లపల్లిరాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment