అతను


ఏవరో

తలుపులు తెరుస్తున్నారు

ఏలనో

లోపలికి ప్రవేశిస్తున్నారు


ఎందుకో

తలపులు లేపుతున్నారు

ఎక్కడికో

మదులను తీసుకెళ్తున్నారు


ఏమిటో

భావాలు వ్యక్తపరుస్తున్నారు

ఏవో

మార్గాలు చూపిస్తున్నారు


కొంతకాంతిని

ప్రసరిస్తున్నారు

కొన్నివిషయాలు

ప్రవచిస్తున్నారు


కొన్నిరంగులు

పట్టుకొస్తున్నారు

కొత్త అందాలు

చూపిస్తున్నారు


కొన్నిపదాలు

చదివిస్తున్నారు

కొన్ని అర్ధాలు

వెల్లడిస్తున్నారు


కొన్నిశబ్దాలు

వినిపిస్తున్నారు

కొండంతశాంతి

అందిస్తున్నారు


కొంతనీడ

ఇస్తున్నారు

కొంతహాయి

కలిగిస్తున్నారు


కొత్తబాటను

చూపిస్తున్నారు

కొన్ని అదుగులు

వేయిస్తున్నారు


కొంతసమయము

కేటాయించమంటున్నారు

కొన్నికబుర్లను

కర్ణాలకందిస్తున్నారు


అతను

కవీంద్రుడు

అతనివి

అద్భుతసృజనలు


అతడిని

గుర్తించుకుందాం

అతనికి

ధన్యవాదాలుతెలుపుదాం


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం


Comments

Popular posts from this blog