ఏమి భాగ్యమో?
ఆమెది
ఏమి భాగ్యమో?
నాది
ఎంత అదృష్టమో?
ఉల్లము
ఉప్పొంగుతుంది
పరువము
పరుగెత్తుతుంది
చుక్కలు
రవికమీదకూర్చున్నాయి
జాబిల్లి
మోముమీదతిష్టవేసింది
ఇంద్రధనస్సు
చీరమీదపరచుకుంది
కౌముది
మదినిముంచెత్తింది
మల్లెలు
జడనుచేరి మత్తెక్కిస్తున్నాయి
గునపాలు
గుండెలోదిగి గుబులురేపుతున్నాయి
కోకిల
కంఠములోదూరి వినిపిస్తుంది
హంస
కాళ్ళనుకదిలించి అడుగులేయిస్తుంది
చిలుక
నోటినిస్వాధీనంచేసుకుంది
అమృతము
పెదవులనాక్రమించింది
అందం
వంటిలోచేరింది
ఆనందం
హృదినినింపింది
సిగ్గు
బుగ్గలకెక్కింది
నిగ్గు
కళ్ళనుచేరింది
చూపు
పట్టేస్తుంది
కైపు
తలకెక్కుతుంది
అందాలకడలిలో
మునుగుతా
ఆనందలోకంలో
విహరిస్తా
ఆమెనుచూచి
అసూయపడకండి
అక్షరాలుచదివి
ఆహ్లాదంపొందండి
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment