కవితాకుసుమాలు


నాకు

చిక్కిన శిల్పాన్ని

నీకు

చక్కని శైలిలో చేరుస్తా


నాకు

నచ్చిన విషయాన్ని

నీవు

మెచ్చేలా మలుచుతా


నాకు

తట్టిన వస్తువును

నీకు

ముట్టేలా మారుస్తా


నాకు

వచ్చిన ఆలోచనలను

నీకు

చక్కగా తెలుపుతా


నాకు

కలిగిన అనుభూతులను

నీకు

వివరంగా విన్నవించుతా


నాకు

కనిపించిన అందాలను

నీకు

వర్ణించి వీక్షింపజేయిస్తా


నాకు

దక్కిన ఆనందాలను

నీకు

చేర్చి సంతసపరుస్తా


నేను

కన్న కలలను

నీకు

కమ్మగ వినిపించుతా


నేను

అల్లిన అక్షరసుమాలను

నీకు

అందించి ఆహ్లదపరుస్తా


నేను

కూర్చిన పదమాలికలను

నీకు

చేర్పించి సంబరపరుస్తా


నేను

వ్రాసిన కవితలను

నీకు

పంపి పరవశపరుస్తా


నా 

కవితలను చదువు

నీ 

స్పందనలను తెలుపు


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం

Comments

Popular posts from this blog