వద్దురా! పెళ్ళొద్దురా!!


వద్దురా వద్దురా

వివాహం వద్దురా

పెళ్ళాము వద్దురా

కష్టాలు వద్దురా                  ||వద్దురా||


కైక మంధరమాటవిని

భర్త ప్రాణముతీసెరా

సీత బంగరులేడినికోరి

మొగునికి కష్టాలుతెచ్చెరా


చిత్రాంగద చిచ్చుపెట్టి

సారంగధరుని హింసించెరా

అప్సరస అందాలుచూపించి

రాజర్షి తపసుచెరిచెరా             ||వద్దురా||


తార వలన

శశి ఇబ్బందులుపడెరా

ఇంతి మూలాన

ఇంద్రుడి ఒళ్ళుచెడెరా


కళ్యాణం నాటకంరా

కాపురం బూటకమురా

ఇల్లు ఇరకటమురా

ఇల్లాలు మరకటమురా             ||వద్దురా||


చక్కదనాలు చూపుతారురా

వలపువలలు విసురుతారురా

చేతుల్లో చిక్కించుకుంటారురా

చెప్పుచేతల్లో పెట్టుకుంటారురా


గయ్యాళ్ళు వద్దురా 

దెయ్యాలు వద్దురా

భూతాలు వద్దురా

ప్రేతాలు వద్దురా                  || వద్దురా||


అతివలు అలుగుతుంటారురా

అలకపానుపు ఎక్కుతుంటారురా

మహిళలు మారాముచేస్తుంటారురా

మొగుళ్ళను బుట్టలోవేసుకుంటారురా


తరుణులు ఏడుస్తుంటారురా

కన్నీరు కారుస్తుంటారురా

కొంగుకు మొగుడినికట్టుకుంటారురా

కుక్కలాగా ప్రక్కనతిప్పుకుంటారురా     ||వద్దురా||


కావ్యాలు ఎరగరా

గ్రంధాలు తిరగెయ్యరా

చరిత్ర తెలుసుకోరా

భవితను బాగుచేసుకోరా


నగలను కోరునురా

చీరలను తెమ్మనురా

ఉరుకులు తీయించురా

పరుగులు పెట్టించురా               ||వద్దురా|| 


మూడుముడులు వేయకురా

మెడకువుచ్చును వేసుకోకురా

నరకముపాలు కాకురా

బంధాలకు చిక్కకురా 


బ్రహ్మచారిగా ఉండురా

బ్రహ్మాండంగా బ్రతకరా

బాదరబందీలు వద్దురా

బరువుభాధ్యతలు తలకెత్తుకోకురా        ||వద్దురా||


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం


Comments

Popular posts from this blog