కవనజ్యోతులు


ప్రభాకరుడు ప్రొద్దున్నే

పడమటికి పయనిస్తుంటే

కాలము కదులుతుంటే

నీడలు తారాడుతుంటే

పద్మాలు వికసిస్తుంటే

పక్షులు ఎగురుతుంటే

కిలకిలా అరుస్తుంటే

ఆలోచనలు పారుతుంటే

మనసు మురిసిపోదా

గుండె గుబాళించదా

హృదయం పరవశించదా

కవిసూరీడు కాంచడా

కలమును చేతపట్టడా

కవనకుసుమాలు వికసించవా


పున్నమి జాబిల్లి

పొడుచుకొస్తుంటే

నింగినీలిరంగు పులుముకుంటే

తారలు తళతళామెరుస్తుంటే

వెన్నెల కురుస్తుంటే

చల్లగాలులు వీస్తుంటే

మబ్బులు తేలుతుంటే

ఉరుములు వినబడతుంటే

మెరుపులు కనబడుతుంటే

టపటపచినుకులు రాలుతుంటే

మది ముచ్చట పడదా

ప్రేమానురాగాలు పుట్టవా

కవిసోముడు గమనించడా

కలమును కదిలించడా

కవితాచంద్రికలు వెలువడవా


రవిచంద్రులు

రెండుకళ్ళు

భువివెలుగులు

కవిప్రేరకులు


సూర్యసోములు

ప్రకృతిప్రతీకలు

సహజసౌందర్యాలు

కవితావస్తువులు


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం


Comments

Popular posts from this blog