సశేషం


పయనం

ఆగదాయె

విరామం

చిక్కదాయె


ప్రయోజనం

సమకూరదాయె

సంతసం

లభించదాయె


దూరం

తరగదాయె

గమ్యం

చేరువకాదాయె


కాలం

కదలదాయె

ముహూర్తం

కుదరదాయె


కమ్మదనం

కరువయిపోయె

మాధుర్యం

దుర్లభమాయె


సుఖం

దొరకదాయె

శాంతం

దక్కదాయె


సంసారం

గడవదాయె

సమరం

ముగియదాయె


జీవనం

సాగాల్సిందె

పోరాటం

చేయాల్సిందె


అంతంకోసం

చూడాల్సిందె

ఆగడియకోసం

నిరీక్షించాల్సిందె


లోకం

విశేషమాయె

జీవితం

సశేషమాయె


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం


Comments

Popular posts from this blog