జగ్గడు


జగ్గడు

తగ్గడు

తిడతాడు

తలవంచడు


పాపం

జగ్గడు

ఓడిపోయాడు

ఓర్పుకోల్పోయాడు


ఎందుకో

జగ్గడు

నిందలేస్తున్నాడు

నిప్పులుచిందుతున్నాడు


ఏలనో

జగ్గడు

కోపాన్నిక్రక్కుతున్నాడు

కొంపముంచారంటున్నాడు


అయ్యో

జగ్గడు

భయపడుతున్నాడు

బంధీచేస్తారనుకుంటున్నాడు


అయ్యయ్యో

జగ్గడు

తడబడుతున్నాడు

తిక్కగామాట్లాడుతున్నాడు


ఏమయ్యిందో

జగ్గడు

కోతిలాతయారయ్యాడు

కిచకిచమంటున్నాడు


అరెరే

జగ్గడు

త్రాగినట్లున్నాడు

తందనాలుత్రొక్కుతున్నాడు


ఎవరెవరినో

జగ్గడు

ప్రాధేయపడుతున్నాడు

రక్షించమనివేడుకుంటున్నాడు


ఎక్కడికో

జగ్గడు

ఊరువిడిచివెళ్ళాడు

చిక్కితేతన్నుతారనుకుంటున్నాడు


ఎవరుచెప్పారో

జగ్గడు

తెలుసుకున్నట్లున్నాడు

కోర్టుశిక్షలుతప్పవనుకుంటున్నాడు


ఏమయనో

జగ్గడు

అడ్డదార్లుపట్టాలనుకుంటున్నాడు

అవినీతినుండిబయటపడాలనుకుంటున్నాడు


పాపం 

జగ్గడు

బయటపడతాడో

భంగపడతాడో

వేచిచూద్దాం

కనిపెట్టుందాం


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం


Comments

Popular posts from this blog