తెలుగు తీరుతెన్నులు
తెలుగుతల్లి
పిలిచింది
వెలుగులను
విసిరింది
తెలుగుబాష
లెస్సన్నది
దేశమందు
మిన్నన్నది
తెలుగుదారి
కనిపించింది
చక్కదనాలను
చూపించింది
తెలుగుతీపి
రుచిచూపింది
మనసును
మురిపించింది
తెలుగుతోటలు
పెరిగాయి
పాడిపంటలు
పొంగాయి
తెలుగుపూలు
పూచాయి
తనువును
తరింపజేశాయి
తెలుగుగాలులు
వీచాయి
సౌరభాలను
చల్లాయి
తెలుగుపదాలు
తట్టాయి
తిన్నగా
తీరాయి
తెలుగుతలపులు
పుట్టాయి
కమ్మనికవితలు
కూరాయి
తెలుగుకవులు
ఆవహించారు
తేటతెల్లముగను
వ్రాయించారు
తెలుగోడినని
ఘనంగాచెప్పుకుంటాను
తలనెత్తుకొని
సగర్వంగాతిరుగుతాను
తెలుగుతీరులు
తిలకించమంటాను
తెలుగుతెన్నులు
తెలుసుకోనమంటాను
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment