మబ్బులు
మబ్బులు
లేకపోతే
తారాపధము
తెరలాకనిపిస్తుంది
మబ్బులు
ఏర్పడుతుంటే
ఆకాశమును
పొగలు ఆక్రమిస్తున్నట్లుంటుంది
మబ్బులు
గుమిగూడుతుంటే
ప్రళయము
ముంచుకొస్తున్నట్లుంటుంది
మబ్బులు
కదులుతుంటే
మలయమారుతము
వీస్తున్నట్లుంటుంది
మబ్బులు
తేలుతుంటే
ఊహలు
మదిలోచెలరేఎగుతాయి
మబ్బులు
మెరుస్తుంటే
వెండి
వెలుగుతున్నట్లుంటుంది
మబ్బులు
క్రమ్ముతుంటే
సమరానికి
సమాయత్తమవుతున్నట్లుంటుంది
మబ్బులు
నల్లబడుతుంటే
తలనెత్తి
పైకిచూడాలనిపిస్తుంది
మబ్బులు
ఆకారాలుమార్చుకుంటుంటే
రకరకాలబొమ్మలు
దర్శనిమిస్తున్నట్లుంటుంది
మబ్బులు
రాసుకుంటుంటే
మెరుపులు
మిలమిలలాడుతాయి
మబ్బులు
కొట్టుకుంటుంటే
ఉరుములు
పెళపెళమంటాయి
మబ్బులు
కరుగుతుంటే
చినుకులు
చిటపటరాలుతాయి
మబ్బులు
ఆకసానికి అందాలు
చెట్లకు బంధువులు
రైతులకు నేస్తాలు
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment