నేను నాస్వభావాలు
నా అంగాలకు
అందంగా తయారవటం తెలియదు
నేను నిరాడంబరుడను
నా చేతులకు
ఎదుటివారిని కొట్టటం చేతకాదు
నేను అహింసావాదిని
నా కాళ్ళకు
తన్ని తరమటం అలవాటులేదు
నేను అందరికీ ఆప్తమిత్రుడను
నా కళ్ళకు
నిప్పులు క్రక్కటం రుచించదు
నేను శాంతమూర్తిని
నా చెవులకు
చాడీలు వినటం పొసగదు
నేను సత్యవాదిని
నా గుండెకు
కఠినంగా ఉండటం వల్లకాదు
నేను దయాళువును
నా హృదయానికి
ఎవరినీ ద్వేషించటం ఎరుగదు
నేను లోకబాంధవుడను
నా మనసుకు
చెడుగా ఆలోచించటం నచ్చదు
నేను సౌమ్యుడను
నా కాయానికి
మోసంచేయటం తెలియనేతెలియదు
నేను నిజాయితీపరుడను
నింగి
ఎవరిమీదా పడాలనుకోదు
నేల
ఎవరినీ మట్టితోకప్పాలనుకోదు
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment