కొత్తలోకం
లోకం
కొత్తగా కనిపిస్తుంది
కన్నులు
ఆర్పకుండా చూడాలనిపిస్తుంది
లోకం
అందంగా అగుపడుతుంది
చూపును
తిప్పకుండా కాంచాలనిపిస్తుంది
లోకం
వింతగా దర్శనమిస్తుంది
దృశ్యాలు
తన్మయత్వాన్ని కలిగిస్తున్నాయి
లోకం
రంగులను చిమ్ముతుంది
కాంతులు
చుట్టూ వ్యాపిస్తున్నాయి
లోకం
ఆశ్చర్యం కలిగిస్తుంది
మనసు
ముచ్చట పడుతుంది
లోకం
అద్భుతాంగా తోస్తుంది
కొండాకోనలు
కళ్ళను కట్టిపడవేస్తున్నాయి
లోకం
అంతరంగాన్ని తట్టుతుంది
అందాలను
వీక్షించమంటుంది
లోకం
మదిని ముట్టుతుంది
ఆనందాలను
ఆస్వాదించమంటుంది
కంటికి
చికిత్స జరిగింది
లోకం
పూర్తిగా మారిపోయింది
లోకం
నావైపే చూస్తుంది
ఏలనో
నన్నే ప్రేరేపిస్తుంది
కవనలోకం
రమ్మని పిలుస్తుంది
కవిత్వం
కమ్మగా కూర్చమంటుంది
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment