భిన్నబాంధవ్యాలు
రాధకి
కృష్ణునికి
బృందావన బంధమేమిటో?
సీతారామునికి
సంజీవరాయునికి
స్వామిసేవకుల సాంగత్యమేమిటో?
సీతాకోకచిలుకకి
సుమానికి
సమాగమ సంబంధమేమిటో?
నింగికి
నేలకు
నెలకొన్న నెయ్యమేమిటో?
మట్టికి
మనిషికి
మహినందు మెలికేమిటో?
దృశ్యాన్నికి
ద్రష్టకి
ధరణినందు దోస్తేమిటో?
ప్రియుడుని
ప్రేయసిని
పెనవేసే ప్రేమపొత్తులేందుకో?
మల్లెలకి
మధుమాసానికి
ముచ్చటగ జతకలపటమెందుకో?
మదాలాపికి
మావిచిగురులకు
మేళనము చేసినదెందుకో?
తెలుగుకి
తేనియకు
తియ్యదనాలను తగిలించినదెందుకో?
కవిని
పాఠకుని
కవితలు కట్టిపడవేయటమెందుకో?
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment