తాజా ఎన్నికలచిత్రం


చంద్రుడు

గెలిచాడు

విమానాల్లో

తిరుగుతున్నాడు


నరేంద్రుడు

ఓడకగెలవక నిలిచాడు

బ్రతికి బయటపడ్డాడు

ఊపిరి పీల్చుకున్నాడు


జగన్నాటకుడు

ఓడిపోయాడు

తలను

దించుకున్నాడు


రాహుద్రష్టుడు

చతికలపడ్డాడు

మరోమారు

అపజయాన్నిమూటకట్టుకున్నాడు


చంద్రుడు

పాలకుడయ్యాడు

తడాఖాను

చూపిస్తున్నాడు


నరేంద్రుడు

కూటమితోకూడాడు

దేశపాలనను

చేతబట్టాడు


జగన్నాటకుడు

తట్టాబుట్టాసర్దుకున్నాడు

చేతులెత్తేశాడు

సమరంనుంచితప్పుకున్నాడు


రాహుద్రష్టుడు

తల్లడిల్లిపోయాడు

విమర్శలు

వెళ్ళక్రక్కుతున్నాడు


చంద్రుడు

చకచకాపావులుకదిపాడు

రాజ్యాధికారానికి

కేంద్రబిందువయ్యాడు


నరేంద్రుడు

ప్రధాననేతయ్యాడు

భారతావనిని

వృద్ధిచేస్తానంటున్నాడు


జగన్నాటకుడు

మెల్లగాజారుకున్నాడు

భయముతో

గడగడావణికిపోతున్నాడు


రాహుద్రష్టుడు

జనాన్నినమ్మించలేకపోయాడు

ప్రతిపక్షానికి

పరిమితమయిపోయాడు


ఎన్నికలచిత్రం

విచిత్రం

నాయకులనాటకం

జగన్నాటకం


కల్పితపేర్లతో

కట్టుకవితనల్లా

పాఠకోత్తములతో

పఠింపజేయతలచా


ఎవ్వరినీ

నొప్పించదలుచుకోలా

ఎవ్వరినీ

తలకెత్తుకోవాలనుకోవటంలా


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం


Comments

Popular posts from this blog