తెలుగుపాట పాడనా!


నేడు

తెలుగుపాట

పాడనా

వెలుగుబాట

చూపనా                               ||నేడు||


నాకు

పాటలు రావు

మాటలు రావు

స్వరాలు రావు

రాగాలు రావు


అయినా

శ్రోతలు అడిగారు

పాటలు కోరారు

గీతము వ్రాశాను

ప్రాసలు కలిపాను                      ||నేడు|| 


కోకిలను తలుస్తాను

కంఠమును ఎత్తుతాను

పెదవులను తెరుస్తాను

పెద్దగరాగము తీస్తాను


తేటగ పలుకుతాను

తేనెను చిందుతాను

చక్కగ పాడుతాను

చక్కెర చల్లుతాను                      ||నేడు||


తెలుగులొ పాడుతాను

వెలుగులు చిమ్ముతాను

అమృతము కురిపిస్తాను

ఆనందము కలిగిస్తాను


మనసులు దోస్తాను

తలలలొ నిలుస్తాను

హృదయము విప్పుతాను

ప్రేమను కురిపిస్తాను                    ||నేడు||


గుండెలు కదిలిస్తాను

గురుతులు మిగిలిస్తాను

మమతను చాటుతాను

మదులను మీటుతాను


సొంతగ రాస్తాను

వింతగ పాడుతాను

కొత్తగ చెబుతాను

ప్రీతిగ వినిపిస్తాను                        ||నేడు||      


తెలుగు పాటలకు

పట్టం కడదాం

గాంధర్వ గానాలకు

స్వాగతం పలుకుదాం


గాయకులను 

గౌరవిద్దాం

రచయితలను

ప్రోత్సహిద్దాం                              ||నేడు||   

 

గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం


Comments

Popular posts from this blog