నా చిట్టా
చూపు
చక్కగుండాలి
పిలుపు
తియ్యగుండాలి
నడక
రాజసంచూపాలి
నడత
ఆదర్శంగుండాలి
శాంతం
ముఖానకనిపించాలి
పంతం
పనుల్లోచూపాలి
నవ్వులు
చిందుతుండాలి
మోమును
వెలుగిస్తుండాలి
తలనిండ
మేధస్సుండాలి
తనువునిండ
తేజస్సుండాలి
ముచ్చట్లు
కొలుపుతుండాలి
మురిపాలు
చేస్తుండాలి
నాలుక
కదులుతుండాలి
కడుపు
నిండుతుండాలి
పెదవులు
అమృతంచల్లాలి
చెవులు
శ్రద్ధగావినాలి
ఆకారం
ఆకర్షించాలి
అంతరంగం
ఉప్పొంగిపోవాలి
అందం
ఆకట్టుకోవాలి
ఆనందం
మదినినింపాలి
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment