పెళ్ళాం జోలి


పెళ్ళాన్ని

ఒప్పించటం

ఒక కళ


పెళ్ళాన్ని

మెప్పించటం

ఒక కల


పెళ్ళాన్ని

ముట్టుకోవటం

ఒక సుఖం


పెళ్ళాన్ని

తట్టుకోవటం

ఒక కష్టం


పెళ్ళాన్ని

రెచ్చకొట్టటం

ఒక అవివేకకార్యం


పెళ్ళాన్ని

ఎదిరించటం

ఒక అనాలోచితకృత్యం


పెళ్ళాన్ని

తిరస్కరించటం

ఒక తిరోగమనకార్యం


పెళ్ళాన్ని

వదులుకోవటం

ఒక అవివేకనిర్ణయం


పెళ్ళాని

సమర్ధించటం

తననుకాపాడుకోవటం


పెళ్ళాని

అర్ధించటం

తనశాశ్వతలొంగుబాటుతనం


పెళ్ళాన్ని

కాపాడుకోవటం

ఒక సామాజికవసరం


పెళ్ళాన్ని

పోషించటం

ఒక తప్పుకోలేనివాగ్దానం


పెళ్ళాన్ని

ప్రశ్నించటం

ఒక తగవుకుశ్రీకారంచుట్టటం


పెళ్ళాన్ని

ప్రేమించటం

ఒక తెలివైనభర్తపాటించవలసినగుణం


పెళ్ళాన్ని

సరిసమానిగాచూడటం

పరస్పరనమ్మకానికినిదర్శనం


పెళ్ళాలను

మంచిగచూచుకుందాం

మమతానురాగాలనుపంచుకుందాం


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం


Comments

Popular posts from this blog