కవుల ఘనకార్యాలు


ఊహల్లో

ఉరికిస్తారు

ఉల్లాల్లో

ఉండిపోతారు


కైతల్లో

కనపడతారు

కలల్లో

కవ్విస్తారు


నదుల్లో

ముంచుతారు

సముద్రంలో

తేలుస్తారు


పెదవుల్తో

పలికిస్తారు

గొంతుల్తో

గళమెత్తిస్తారు


కల్పనల్లో

కూరుస్తారు

బ్రాంతుల్లో

పడవేస్తారు


ఉయ్యాలల్లో

ఊగిస్తారు

ఉత్సాహాల్లో

ఉప్పొంగిస్తారు


వెన్నెలలో

విహరింపజేస్తారు

పూలతోటల్లో

పచార్లుచేయిస్తారు


కలాల్లో

దూరతారు

కాగితాల్లో

కూర్చుంటారు


అక్షరాల్తో

బంధిస్తారు

పదాలతో

కట్టేస్తారు


దోసిట్లలో

అమృతంపోస్తారు

అధరాలతో

ఆస్వాదించమంటారు


అందాల్లో

కాపురంపెట్టిస్తారు

ఆనందాల్లో

కాలక్షేపంచేయిస్తారు


కవులు

కవనబ్రహ్మలు

కవితలు

తేనెలజల్లులు


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం


Comments

Popular posts from this blog