సాహిత్యశోభలు
మేఘాలు
చినుకులు రాలుస్తున్నాయి
చిన్నారులు
చిందులు త్రొక్కుతున్నారు
కవులు
కలాలకు పనిపెడుతున్నారు
పలుకులు
తేనెచుక్కల్లా చల్లబడుతున్నాయి
వినేవాళ్ళు
ఆలకించి అబ్బురపడుతున్నారు
కైతగాళ్ళు
కమ్మగ పుటలనింపుతున్నారు
రవి
కిరణాలను ప్రసరిస్తున్నాడు
భువి
మిలమిల మెరిసిపోతున్నది
కవి
కని కైతలుకూరుస్తున్నాడు
శశి
వెన్నెలను వెదజల్లుతున్నాడు
గాలి
చల్లగా వీస్తున్నది
కయి
ప్రేమపాటలు వ్రాస్తున్నాడు
కవులు
భావాలను వదులుతున్నారు
పాఠకులు
పఠించి పరవశపడుతున్నారు
సాహితీలోకము
సుసంపన్నమై శోభిల్లుతుంది
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment