సాహిత్యసవ్వడులు


చిన్నారుల

ముద్దుపలుకులు

ముచ్చట

కొలుపుతాయి


కోకిలల

కమ్మనికూతలు

కర్ణాలకింపు

కలిగిస్తాయి


చిలుకల

చక్కెరపలుకులు

చెవుల

సంబరపరుస్తాయి


గాంధర్వ

గానాలు

మదుల

మురిపించుతాయి


చెలియ

గుసగుసలు

హృదయాల

పరవశపరుస్తాయి


ప్రేమ

పలకరింపులు

మనసుల

పులకరింపచేస్తాయి


చినుకుల

చిటపటలు

చెప్పలేనిహాయి

చేకూరుస్తాయి


గాయకుల

శ్రావ్యస్వరాలు

శ్రోతల

సంతసపరుస్తాయి


పండితుల

ప్రవచనాలు

తత్వాలను

తెలియపరుస్తాయి


తుమ్మెదల

ఝుంకారాలు

పువ్వులను

వణికిస్తాయి


భక్తుల

భజనలు

భగవంతునందు

భక్తినిపెంచుతాయి


కవితల

చప్పుడులు

చిత్తాలను

చెలరేగిస్తాయి


సాహితీ

సవ్వడులు

సరస్వితీదేవిని

స్మరింపజేస్తాయి


వీణానాదానికి

వినమ్రస్వాగతాలు

వాణీదేవికి

వందనాలు


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం


Comments

Popular posts from this blog