జై జై తెలుగు


తెలుగుతల్లి బిడ్డనోయ్

వెలుగుచిమ్ము వాడనోయ్

తెలుగుపలుకు నోరునోయ్

తీపి చల్లుచుందునోయ్


తెలుగుజాతి వారసుడనోయ్

తాతముత్తాతల తలతునోయ్

తెలుగునేల తిరుగువాడనోయ్

తోటివారిమేలు కోరుచుందునోయ్


తెలుగుతోట పెంచువాడనోయ్

వివిధపండ్లు కాయించెదనోయ్

తెలుగుపూలు పూయించదనోయ్

పరిమళాలు ప్రసరించెదనోయ్


తెలుగుఖ్యాతి చాటువాడనోయ్

గళమునెత్తి స్తుతించువాడనోయ్

తెలుగుజ్యోతులు వెలుగించువాడనోయ్

చుట్టూకాంతులు వ్యాపించువాడనోయ్


తెలుగుగాలి వీచువాడనోయ్

తనువుతట్టి పులకించువాడనోయ్

తెలుగుదేశానికి జైకొట్టువాడనోయ్

గొంతులుకలిపి ముందుకురారండోయ్


తెలుగక్షరాలు ముత్యాలోయ్

చిక్కగహారాలు కూర్చండోయ్

తెలుగుపదాలు చక్కెరగుళికలోయ్

చక్కగపొదిగి పాటపాడండోయ్


తెలుగుకైతలు కూర్చెదనోయ్

తేటపదాలు వాడెదనోయ్

తెలుగామృతము చల్లెదనోయ్

తృప్తినందరికి కలిగించెదనోయ్


జైజై తెలుగు

జయహో తెలుగు

జైజై తెలుగు

జయహో తెలుగు


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం


Comments

Popular posts from this blog