అందాల చిన్నది
ఎంత చక్కని చూపులు
చూడ ముచ్చటగున్నది
ఎంత చక్కని రూపము
కళ్ళు లాగుతుయున్నది
ఎంత చక్కని వదనము
వెలుగు చిమ్ముచుయున్నది
ఎంత చక్కని బట్టలు
బుట్ట బొమ్మగయున్నది
ఎంత చక్కని కంఠము
కోకిలమ్మగ యున్నది
ఎంత చక్కని పలుకులు
తేనె చిమ్ముతుయున్నది
ఎంత చక్కని మాటలు
మదిని ముట్టుతుయున్నది
ఎంత చక్కని బుగ్గలు
ఎరుపు రంగునయున్నవి
ఎంత చక్కని వర్ణము
పసిడి రంగునయున్నది
ఎంత చక్కని చిన్నది
తోడు కోరుచుయున్నది
ఎంత చక్కని నడకలు
హొయలు ఒలుకుచున్నది
ఎంత చక్కని చిలిపిది
చెయ్యి చాపుతుయున్నది
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment