కవనవృక్షం
నేను
కడలిలో చుక్కను
కారడవిలో మొక్కను
కవులలో అనామకుడను
రోజూ
కవనవృక్షంక్రింద
కూర్చుంటాను
కుతితీర్చుకుంటాను
రోజూ
లక్షల అక్షరపత్రాలను
ప్రోగుచేస్తాను
పేర్చుతాను
రోజూ
వందల పదపుష్పాలను
సేకరిస్తాను
అల్లుతాను
రోజూ
కొలది కవితాకాయలను
పండిస్తాను
పంచుతాను
రోజూ
కవనతరంగాలను
త్రోలుతాను
తనువులుతడతాను
రోజూ
కవితాగానాలను
వినిపిస్తాను
వినోదపరుస్తాను
రోజూ
కవనమేఘాలను
చెంతకుపిలుస్తాను
జల్లులుకురిపిస్తాను
రోజూ
సాహితీవనప్రియులను
సమీపిస్తాను
సంబరపరుస్తాను
రోజూ
సాహితీవనంలో
సంచరిస్తాను
సుభిక్షంచేస్తాను
రోజూ
కవినై కవితనై
ముందుకొస్తుంటాను
మదులుదోస్తుంటాను
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment