కోకిల కబుర్లు
కోకిల
పొద్దున్నెవచ్చింది
పెరటిచెట్టుపైన
వ్రాలింది
కొమ్మపైన
కూర్చుంది
గళమును
విప్పింది
కుహూకుహూ
కూసింది
కుతూహలము
కలిగించింది
కమ్మగ
పిలిచింది
మాధుర్యాలు
క్రోలుకొమ్మంది
శ్రావ్యంగ
పాడింది
బాధలు
మరచిపొమ్మంది
చెంతకు
రమ్మంది
చెవులకు
విందునిచ్చింది
మదిని
మురిపించింది
మధురిమలను
పంచిపెట్టింది
సంతసము
పొందమంది
తనను
గుర్తించుకొమ్మంది
మనసుపెట్టి
వినమంది
రాగామృతము
త్రాగమంది
ఆలపించి
ఆకర్షించింది
మనసును
దొచేసింది
సెలవు
తీసుకుంది
మరసటిరోజు
మరలావస్తానంది
రివ్వున
ఎగిరిపోయింది
నిశ్శబ్దము
ఆవరించింది
కోకిలకబుర్లు
నచ్చకపోతే క్షమాపణలు
కూర్చినవ్రాతలు
బాగున్నాయంటే ధన్యవాదాలు
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment