కవితాధ్యేయం


కవితాతీరు

మారాలి

కవనశక్తిని

చాటాలి


విషయం

వైవిధ్యం కనపరచాలి

విధానం

విన్నూతనం చూపించాలి


అల్లిక

అదరగొట్టాలి

మదులను

మురిపించాలి


హృదయాలను

పొంగిపొర్లించాలి

పాఠకులను

పరవశపరచాలి


పోలికలు

ఆకర్షించాలి

మోదము

మదులమీటాలి


కవిత్వం

కమ్మదనముచూపాలి

సాహిత్యం

శాశ్వతముగనిలవాలి


కవనాలు

కీర్తీనితేవాలి

కవులు

అమరులయిపోవాలి


సమ్మేళనాలు

సాగుతుండాలి

సత్కారాలు

జరుగుతుండాలి


చెప్పిందే

చెప్పకూడదు

తోచిందే

రుద్దకూడదు


భాషను

బ్రతికించేలాగుండాలి

వెలుగులను

వ్యాపించేలాగుండాలి


సాహితీపయనాన్ని

సాగిద్దాం

సరస్వతీసేవలని

చేసేద్దాం


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం

Comments

Popular posts from this blog