తీరనిదాహం


నా దాహం

తీరటంలా

నేకోరింది

దొరకటంలా


నా స్వప్నం

నిజమవటంలా

నేననుకున్నది

జరగటంలా


నా సేద్యము

ఫలప్రదమవటంలా

నేనాశించినది

పండటంలా


నా ప్రయత్నం

ప్రయోజనమివ్వటంలా

నేనుతలచినది

లభించటంలా


నా పయనం

ఆగటంలా

నేచేరాలనుకున్నది

చేరువవ్వటంలా


నా ఆశయం

నెరవేరటంలా

నేకాంక్షించినది

చిక్కటంలా


నా కలం

నాణ్యంగావ్రాయటంలా

నేనుచెప్పింది

అమలుపరచటంలా


నా ఊహలు

ఉపయోగపడటంలా

నేనుద్దేశించింది

సిద్ధించటంలా


నా మనసు

సహకరించటంలా

నేకావాలన్నది

అందించటంలా


అందమైన

ఆనందకరమైన

కవిత

కూరటంలా


అద్భుతమైన

అపరూపమైన

కైత

తయారవటంలా


అమోఘమైన

ఆశ్ఛర్యకరమైన

కయిత

పుటలకెక్కటంలా


అమూల్యమైన

అసమాన్యమైన

కవనము

కలమునుండిజాలువారటంలా


ఆదిప్రాసయుక్తమైన

అంత్యప్రాసయుక్తమైన

కైతము

కాగితాలపైకూర్చోవటంలా


అమృతతుల్యమైన

అపూర్వమైన

కవిత్వము

ఆవిర్భవించటంలా


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం


Comments

Popular posts from this blog