పుత్తడిబొమ్మ
సృష్టికర్త బ్రహ్మ
చేశాడు బొమ్మ
పోశాడు ప్రాణము
పంపాడు భూలోకము
బుగ్గల
పాలుకార్చే బొమ్మ
సిగ్గుల
ఒలకబోసే బొమ్మ
పెదాల
తేనెలుచిందే బొమ్మ
మోమున
వెలుగులుచిమ్మే బొమ్మ
అందరిని
అలరించే బొమ్మ
ఆనందాన్ని
కలిగించే బొమ్మ
వయ్యారాలు
వీక్షించమనే బొమ్మ
విచిత్రాలు
వ్యక్తపరచే బొమ్మ
పకపకలు
కురిపించే బొమ్మ
తళతళలు
చూపించే బొమ్మ
కులుకులు
చిందేబొమ్మ
పలుకులు
చల్లే బొమ్మ
ఆటలు
ఆడే బొమ్మ
పాటలు
పాడే బొమ్మ
చిత్తాలు
దోచే బొమ్మ
చిత్రాలు
చూపే బొమ్మ
అందాల
అపరంజి బొమ్మ
ఆనందాల
అపర బ్రహ్మ
ఆమె నేటిమొగ్గ
రేపటి విరి
నేటి సుమబాల
రేపటి పుష్పకన్య
ఆమె నేటి కవనబాల
రేపటి కవితాకన్యక
నేటి పసిపాప
రేపటి ముగ్ధమోహిని
ఆమె సృష్టికి మూలం
ప్రేమకు బీజం
అందాలకు ముద్దుగుమ్మ
ఆనందాలకు పట్టుగొమ్మ
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment