మాటలముల్లెలు 


మాటలు

మీటుతున్నాయి

తూటాలు

పేల్చమంటున్నాయి


మాటలు

పైనపడుతున్నాయి

మూటలు

కట్టేయమంటున్నాయి


మాటలు

పిలుస్తున్నాయి

ప్రేమలు

ఒలకబోస్తున్నాయి


మాటలు

ప్రేమిస్తున్నాయి

మోహము

రేపుతున్నాయి


మాటలు

మురిపిస్తున్నాయి

ముచ్చట్లు

చెప్పమంటున్నాయి


మాటలు

ఊరుతున్నాయి

పుటలు

నింపమంటున్నాయి


మాటలు

పేర్చమంటున్నాయి

కైతలు

కూర్చమంటున్నాయి


మాటలు

వెంటబడుతున్నాయి

పాటలు

వ్రాయమంటున్నాయి


మాటలు

తీపిచుక్కలుచల్లుతున్నాయి

మిఠాయీలు

తయారుచేయమంటున్నాయి


మాటలు

మంత్రాలవుతున్నాయి

మనసులు

బంధించబడుతున్నాయి


మాటలు

మరుమల్లియలు

సుమసుగంధాలు

తేనెతియ్యదనాలు


మాటలు

మెరుపులు

మంత్రాలు

మిఠాయీలు


మాటలు

పువ్వులు

నవ్వులు

జల్లులు


మాటలు

పరువు

తెరువు

దరువు


మాటలు

క్రుక్కను

క్రక్కను

త్రొక్కను


మాటలు

జారను

మీరను

తప్పను


మంచిమాటలు

వీడకు

మాయమాటలు

నమ్మకు


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం


Comments

Popular posts from this blog