ఓ మనిషీ!
పూలుపూయని మొక్కను
పీకేయకురా!
కాయలుకాయని చెట్టును
కొట్టేయకురా!
బిడ్డలుకనని భార్యను
బాధించకురా!
వాసనలేని విరులను
విసిరేయకురా!
వర్షించని మేఘాలను
దూషించకురా!
పంటపండలేదని పొలాలను
బీడులుగా వదలకురా!
నిత్యం మానవత్వం
చూపరా!
అనుదినం ఆర్తులను
ఆదుకోరా!
రోజూ ప్రేమను
పంచరా!
ప్రతిదినం ప్రజాసేవను
చెయ్యరా!
సతతం సంఘసంక్షేమానికి
శ్రమించరా!
మనిషిగా మెలగరా
మూర్ఖత్వాన్ని వీడరా
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment