కవితాకుమ్మరింపులు
అరిసెలా
తీయగున్నది
నోటిలో
నానుతున్నది
ముద్దలా
మ్రింగమంటున్నది
కడుపును
నింపుకోమంటున్నది
చుక్కలా
చక్కగున్నది
కనులారా
కాంచమంటున్నది
గాలిలా
వీచుచున్నది
మేనును
త్రాకుచున్నది
ఊహలు
లేపుచున్నది
ఊయల
ఊపుచున్నది
ఉత్సాహం
కలిగిస్తుంది
ఉవ్విళ్ళు
ఊరిస్తుంది
అమృతంలా
త్రాగమంటున్నది
అధరాలకు
అంటుకుంటున్నది
పసందుగా
పాడమంటున్నది
పరవశంలో
మునిగిపొమ్మంటున్నది
తనను
గుర్తించుకోమంటున్నది
కవిని
తలచుకోమంటున్నది
కవితకి
స్వాగతం
కవికి
వందనం
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment