జీవితపాఠాలు
జీవనం గాలివాటం
బ్రతకటంకోసం నిత్యపోరాటం
బాల్యం అమాయకం
తోచిందిచెయ్యటం దొరికిందిపుచ్చుకోవటం
కౌమారం ఙ్ఞానార్జనం
జీవితగమ్యం నిశ్చయించుకోవటం
యవ్వనం కలలుకనటం
భాగస్వామితోకాలంగడపడటం సుఖాలుపంచుకోవటం
వృధ్యాప్యం ఙ్ఞాపకాలునెమరువేసుకోవటం
మరణంకోసం ఎదురుచూడటం
పరోపకారం మానవత్వం
అపకారం అమానుషం
పడటం సామాన్యం
లేవటం సరిదిద్దుకోవటం
ప్రయత్నం సాధనకుమూలం
విరమించుకోవటం ఓటమినొప్పుకోవటం
ఓడిపోవటం సహజం
విజయసాధనం వీరలక్షణం
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
9177915286
Comments
Post a Comment