కవిత్వం కావాలికవిత్వం చూపాలికవిత్వం


కవిత్వం

కమ్మగానుండాలి

సాహిత్యం

సొమ్ములాగుండాలి


కవిత్వంలో

కవితశాతంపెరగాలి

కవనంలో

వచనశాతంతగ్గాలి


తక్కువపదాలతో

ఎక్కువభావంతెలుపాలి

అనవసరపదాలతో

ఎక్కడావిసిగించకుండాలి


విషయాలలో

విన్నూతనంచూపాలి

వివరణలలో

వైవిధ్యంచాటాలి


అక్షరాలు

జలజలలాడాలి

పదములు

జివజివలాడాలి


ధనమై

దాచుకోమనాలి

దుస్తులై

ధరించమనాలి


చూస్తే

ఆకర్షించాలి

చదివితే

అంటుకుపోవాలి


ఆరంభం

అదరగొట్టాలి

అంతం

అంతరంగాన్నితట్టాలి


పోలికలు

పెక్కుండాలి

ప్రాసలు

ప్రవహించాలి


విసిరితే

వంటికితగలాలి

ప్రేలిస్తే

మనసులోదూరాలి


స్వాగతిస్తే

చెంగుచెంగునరావాలి

స్వరపరిస్తే

చెవులకుశ్రావ్యతనివ్వాలి


కదిలిస్తే

చకచకనడవాలి

అదిలిస్తే

పరుగులుతీయాలి


అర్ధంచేసుకుంటే

అమృతంచల్లాలి

మదిలోదాచుకుంటే

మహత్యంచూపాలి


క్షరరహితాలు

కళకళలాడాలి

కూర్చినపదాలు

కువకువలాడాలి


కవిత్వం

పెన్నిధికావాలి

కవనం

సన్నిధినుండాలి


కవిత్వం

శ్రీశ్రీనితలపించాలి

కవనం

త్రిశ్రీనిగురుతుకితేవాలి


కవిత్వం

కావాలి కవిత్వం

కవిత్వం

చూపాలి కవిత్వం


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం


(త్రిశ్రీ= త్రిపురనేని శ్రీనివాస్)



Comments

Popular posts from this blog