కోడళ్ళకధలు
ఓ కాబోయేకోడలు
షరతు విధించింది
అత్తామామలతో కలసివుండాలంటే
పెళ్ళికి అంగీకరించనని
ఓ రాబోయేకోడలు
ముందుగా చెప్పింది
వేరేకాపురం పెడితేనే
భర్తదగ్గరకు వస్తానని
ఓ ఉద్యోగంచేసేకోడలు
నిర్మొహమాటంగాచెప్పింది
అత్తపనిమనిషిలాగా అన్నిపనులుచేస్తేనే
ఒప్పుకుంటానని లేకపోతే తరిమిపారేస్తానని
ఓ గడుసరికోడలు
ఒక కధనల్లింది
మామ చేయిపట్టుకుంటున్నాడని
ఇంటినుండి పంపించేయాలని
ఓ సుప్పనాతికోడలు
మొగుడుకు చెప్పింది
మామకు అన్నంపెట్టనని
తానేపెట్టుకొని తినాలని
ఓ వగలమారికోడలు
భర్తను బెదిరిస్తుంది
అత్తామామలను వదులుకోవాలని
లేకుంటే పుట్టింటికివెళ్తానని
ఓ గడుగ్గాయికోడలు
నోట కొక్కిరింతలుకూసింది
నొసట ఈసడింపులుచూపింది
మొహాన ఉమ్మేసినంతపనిజేసింది
అత్తాకోడళ్ళూ
కుక్కాపిల్లులా
ఉప్పూనిప్పులా
తూర్పూపడమరలా
కోడళ్ళకు
మొగుళ్ళుమాత్రమే కావాలా
అత్తామామలు
అక్కరలేదని గెంటివేయాలా
కోడళ్ళకు
మగనిభర్త ఆస్తులుకావాలా
మామగారిని
ఇంటినుంచి పంపించెయ్యాలా
కోడళ్ళారా తెలుసుకోండి
కొడుకులపెళ్ళాలు
రేపు నిన్నూ బాధలుపెడతారు
నీవునేర్పినవిద్యయె అత్తమ్మాయంటారు
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment