శ్రావణశోభలు
శ్రావణమాసము
ఊరూర మారుమ్రోగుతుంది
రమాదేవిపాటలు
వీనులకు విందునిస్తున్నాయి
శ్రావణశోభలు
కనబడుతున్నాయి
చైతన్యమును
కలిగిస్తున్నాయి
శ్రావణమేఘాలు
తేలుతున్నాయి
చిరుజల్లులను
చల్లుతున్నాయి
శ్రీలక్ష్మీపూజలు
చాలాచోట్లజరుపుతున్నారు
సుహాసినీలు
శ్రద్ధగాపాల్గొంటున్నారు
వరలక్ష్మిని
కొలుస్తున్నారు
వరాలను
కోరుకుంటున్నారు
పసుపుకుంకుమలు
పంచుతున్నారు
చీరెరవికలు
ఇచ్హిపుచ్చుకుంటున్నారు
వివాహాలు
జరుగుతున్నాయి
విందులు
పసందుగొలుపుతున్నాయి
మంగళవారాలు
గౌరీపూజలు చేస్తున్నారు
శుక్రవారాలు
లక్ష్మీపూజలు చేస్తున్నారు
వరలక్ష్మీ వ్రతమును
గుడిలో చేస్తున్నాము
ముత్తయిదవులను
స్వాగతిస్తున్నాము
రండి
పాల్గొనండి
లక్ష్మీదేవికృపకు
పాత్రులుకండి
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment