తెలుగంటె నాకిష్టము


బాషలందు మేటైన

తెలుగుబాష నాకిష్టము

తేనెకంటె తియ్యనైన

తెనుగుబాష నాకిష్టము


జాబిలికంటె చక్కనైన

తెలుంగు నాకిష్టము

నీటికంటె చల్లనైన

ఆంధ్రా నాకిష్టము


వెన్నెలకంటె మిన్నయిన

అచ్చతెలుగు నాకిష్టము

రవికంటె ప్రకాశమైన

తేటతెలుగు నాకిష్టము


యతిప్రాసలున్న

తెలుగుపద్యము నాకిష్టము

కమ్మనైన 

తెలుగువచనకైతలు నాకిష్టము


పోతన భాగవతము

నాకిష్టము

శ్రీనాధుని శృంగారకావ్యము

నాకిష్టము


సుమతి సూక్తులు

నాకిష్టము

వేమన ఆటవెలదులు

నాకిష్టము


క్రిష్ణశాస్త్రి భావకవితలు

నాకిష్టము

సినారె సినిమాపాటలు

నాకిష్టము


శ్రీశ్రీ పదప్రయోగాలు

నాకిష్టము

త్రిశ్రీ కోరినకవితాలక్షణాలు

నాకిష్టము


తిలక్ కవితామృతజల్లులు

నా కిష్టము

సిరివెన్నెల చిత్రగీతాలు

నాకిష్తము


తెలుగునేలల పండు

పంటలు నాకిష్టము

తెలుగుపలుకులు చిందు

తోటితెలుగొళ్ళు నాకిష్టము


తెలుగుతోటలలో పూచు

తెలుగుపూలు నాకిష్టము

తెనుగుపువ్వులు చిందు

తెనుగుసౌరభాలు నాకిష్టము


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం


Comments

Popular posts from this blog