కవనం సాగిస్తా! కవితలు పారిస్తా!


మెదడుకు

మత్తెక్కించి

ఆలోచనలను

అరికట్టకు


కళ్ళముందు

కదలాడుతున్న

కాగితాలను

కాజేయకు


తోడుగానీడగా

నిలచిన

కలమును

కొట్టేయకు


చేతులను

బంధించి

కవనమును

నిరోధించకు


గొంతును

నొక్కిపట్టి

కవితాగానమునకు

అడ్డుపడకు


రక్తమును

గడ్డకట్టించి

కవితాప్రవాహమును

నిలిపివేయకు


గుండెచప్పుళ్ళను

నిలువరించి

కవితాపఠనమును

నివారించకు


కొట్టుతిట్టు

కేకలువెయ్యి

కవితావిష్కరణలను

కట్టడిచేయకు


కవితకోసం

కాచుకుంటా

పాఠకులకోసం

ప్రయాసపడతా


కవితలే

నా ఆహరం

కవనమే

నా బలం


కవనక్రియను

ఆటంకపరచకు

కవితాప్రియులను

నిరాశపరచకు


కవనం

సాగిస్తా

కవితలు

పారిస్తా


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం

Comments

Popular posts from this blog