ఓ నవకవీ!
పరిమళములేని పువ్వు
పూజకనర్హము
ప్రమోదమివ్వని కైత
పఠనకనర్హము
గమ్యంలేని పయనం
నిరర్ధకము
అర్ధం లేనికవిత
నిష్ప్రయోజనము
ప్రేరణలేని లేమ
వర్జనీయము
మదిని తట్టనికవిత
రసహీనము
సుఖం లేనిజీవితము
అవాంఛనీయము
పోలికలులేని కవనము
అనాకర్షితము
వెలుగులేని బాట
విసర్జనీయము
మెరుపులులేని కైత
తిరస్కరణీయము
పువ్వులులేని మొక్క
అందవిహీనము
సందేశములేని కయిత
శుద్ధవ్యర్ధము
తీపిలేని పలుకులు
నిస్సారము
లయలేని కవితలు
అశ్రావ్యము
ఉప్పులేని కూర
చప్పన
చమక్ లేనికవిత
దండగ
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment