ఆకాశం ఎర్రబడింది
అక్కడ
అబలపై జరుగుతున్న
అత్యాచారాన్ని చూచి
ఆకాశం ఎర్రబడింది
అక్కడ
దారిదోపిడీలు చేస్తున్న
దొంగలముఠాను చూచి
ఆకాశం ఎర్రబడింది
అక్కడ
అమానుషంగా
అమాయకులను నరకటంకని
ఆకాశం ఎర్రబడింది
అక్కడ
ఎన్నో దౌర్జ్యన్యాలనుచేసి
ఎన్నుకోబడిన నేతనుచూచి
ఆకాశం ఎర్రబడింది
అక్కడ
అప్పుడేపుట్టిన శిశువును
చెత్తబుట్టల్లో వేయటంచూచి
ఆకాశం ఎర్రబడింది
అక్కడ
అమ్మానాన్నలను గెంటుతున్న
తనయులనుచూచి
ఆకాశం ఎర్రబడింది
అక్కడ
లంచాలు తీసుకుంటున్న
అవినీతి అధికారులనుచూచి
ఆకాశం ఎర్రబడింది
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment