అంతా తెలుగుమయం


తెలుగు తల్లి

పిలుస్తున్నది

తెలుగు తీపిని

తినిపిస్తున్నది


తెలుగు దీపాలు

వెలుగుతున్నాయి

తెలుగు కాంతులు

ప్రసరిస్తున్నాయి


తెలుగు గాలులు

వీస్తున్నాయి

తెలుగు అక్షరాలు

వ్యాపిస్తున్నాయి


తెలుగు మేఘాలు

కురుస్తున్నాయి

తెలుగు పదాలు

ప్రవహిస్తున్నాయి


తెలుగు గళాలు

తెరుచుకుంటున్నాయి

తెలుగు పాటలు

తన్మయపరుస్తున్నాయి


తెలుగు నదులు

ప్రవహిస్తున్నాయి

తెలుగు జలాశయాలు

పొంగిపొర్లుతున్నాయి


తెలుగు సేద్యము

కొనసాగుతుంది

తెలుగు పంటలు

పండుతున్నాయి


తెలుగు అందాలు

ఆరబోస్తున్నాయి

తెలుగు మోములు

వెలిగిపోతున్నాయి


తెలుగు పువ్వులు

పొంకాలుచూపుతున్నాయి

తెలుగు సౌరభాలు

విరజిమ్ముతున్నాయి


తెలుగు కవితలు

జాలువారుతున్నాయి

తెలుగు కవులు 

మురిపిస్తున్నారు


తెలుగు భాషకు

పట్టంకడదాం

తెలుగు జాతికి

ఖ్యాతినితెద్దాం


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం


Comments

Popular posts from this blog