కవితావంటకాలు
కవితలు
నేర్చుకున్నా
కమ్మగా
కూర్చుదామని
కవితలు
వ్రాస్తున్నా
చక్కగా
చదివిద్దామని
కవితలు
విసురుతున్నా
ఎగిరి
పట్టుకుంటారని
కవితలు
చల్లుతున్నా
తడిసి
ఆనందిస్తారని
కవితలు
పాడుతున్నా
శ్రద్ధగా
వింటారని
కవితలు
పారిస్తున్నా
గొంతులు
తడుపుకుంటారని
కవితలు
సృష్టిస్తున్నా
మనసులు
దోచుకోవాలని
కవితలు
కుమ్మరిస్తున్నా
పాఠకులు
ఏరుకుంటారని
కవితలు
పంపుతున్నా
అందుకొని
ఆస్వాదిస్తారని
కవితలు
ప్రచురిస్తున్నా
కలకాలం
నిలుస్తాయని
కవితలు
వండుతున్నా
కడుపులు
నింపుకుంటారని
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment