తెలుగుసుధలు
అమృతవర్షము కురిసింది
తనువులను శుద్ధిచేసింది
తెలుగును తడిపింది
అమరము చేసింది
సుధారసము చిందింది
పెదవులను అంటింది
తెలుగును పలికించింది
తీయదనమును చేకూర్చింది
పీయూషఘటము వచ్చింది
క్రోలుకోమని కోరింది
తెలుగును తలకెక్కించింది
కమ్మదనాలకు తావునుచేసింది
కంజకిరణాలు ఉదయించాయి
కళ్ళను తెరిపించాయి
తెలుగును ఆవహించాయి
వెలుగును వ్యాపించాయి
రేత్రబిందువులు వేకువనేపడ్డాయి
పువ్వులపైన తావిచుక్కలయ్యాయి
తెలుగును అంటుకున్నాయి
సుగంధాలను వెదజల్లాయి
అందుకే తెలుగుదేశానలెస్సయ్యింది
అమరమయ్యింది మధురమయ్యంది
కమనీయమయ్యింది వెలుగయ్యింది
సౌరభమయ్యింది ప్రపంచప్రఖ్యాతిపొందింది
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment