నాలోకాలు


ఊహలలోకం

ఊరిస్తుంది

ఉల్లమును

ఊపేస్తుంది


ప్రేమలోకం

రమ్మంటుంది

బాంధవ్యాలలో

బంధిస్తుంది


పుష్పలోకం

ప్రవేశించమంటుంది

పరిమళసౌందర్యాలను

పుటలకెక్కించమంటుంది


అందాలలోకం

ఆహ్వానిస్తుంది

అద్భుతకవితలను

ఆవిష్కరించమంటుంది


ఆనందలోకం

అలరిస్తుంది

అపూర్వకైతలను

అల్లమంటుంది


వింతలోకం

విహరించమంటుంది

విశిష్టకవనాలను

వెలువరించమంటుంది


కొత్తలోకం

కాలుపెట్టమంటుంది

నూతనరచనలకు

నాందిపలుకమంటుంది


పాఠకలోకం

పిలుస్తుంది

మంచికయితలతో

మనసులుముట్టమంటుంది


సాహిత్యలోకం

సందర్శించమంటుంది

సుకవితలతో

సుభిక్షంచేయమంటుంది


వివిధలోకాలకు

వెళ్ళొస్తా

రమ్యకవితలను

రాసేస్తా


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం


Comments

Popular posts from this blog