కవితావిందుకు స్వాగతం

 

భావము

పుడితే

కవితను

కూర్చేస్తా


కిటుకు

దొరికితే

కైతను

అల్లేస్తా


మాట

మురిపిస్తే

కయితను

రాసేస్తా


ఊహ

ఊరిస్తే

కాగితంపై

గీసేస్తా


విషయం

వెంటబడితే

కలమును

పరుగెత్తిస్తా


అందము

అలరిస్తే

కవితగామార్చి

కుతూహలపరుస్తా


విరులు

వేడుకచేస్తే

పుష్పసౌరభాలను

పుటలకెక్కిస్తా


సందర్భం

స్ఫురిస్తే

చక్కనికైతను

చెక్కేస్తా


ప్రకృతి

పరవశపరిస్తే

భావకవితను

బరబరాబయటపెడతా


ఆకలయితే

సుష్ఠుగాతినమని

కవితాభోజనమును

వడ్డిస్తా


కవుల వంటలకు

వందనం

కవితల విందుకు

స్వాగతం


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం


Comments

Popular posts from this blog