ప్రేమలు
ప్రేమ
ఒక లోకం
పిలుస్తుంది
ప్రేరేపిస్తుంది
ప్రేమ
ఒక బంధం
కట్టేస్తుంది
కలిపేస్తుంది
ప్రేమ
ఒక పిచ్చి
దించుతుంది
ముంచుతుంది
ప్రేమ
ఒక మత్తు
ఆలోచించనీయదు
విరమించనీయదు
ప్రేమ
ఒక నది
దిగమంటుంది
దాటమంటుంది
ప్రేమ
ఒక రోగం
మందులకుతగ్గదు
మాటలకులొంగదు
ప్రేమ
ఒక భోగం
ఊరిస్తుంది
ఉబికిస్తుంది
ప్రేమ
ఒక స్వప్నం
తలపుకొస్తుంది
తంటాలుపెడుతుంది
ప్రేమ
ఒక నాటకం
పాత్రనిస్తుంది
పోషించమంటుంది
ఎవరైనా
ఎప్పుడైనా
ప్రేమకు దాసులే
పొందుకు ప్రియులే
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment